- ఆత్మకూరు మండల వైద్యాధికారి స్పందన
కాకతీయ,ఆత్మకూరు : పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఆత్మకూరు మండల వైద్యధికారి డాక్టర్ స్పందన తెలిపారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డాక్టర్ స్పందన మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో వేయించాలని తల్లితండ్రులకు సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమం అక్టోబర్ 14 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలియో చుక్కలు వేసుకొనని పిల్లలకు 13, 14 తేదీల్లో ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ అధికారి ఖలీం, ఏఎన్ ఎం సునీత, ఆశవర్కర్లు రమ, మౌనిక, ప్రసన్న, అన్నపూర్ణ, కోమల తదితరులు పాల్గొన్నారు.


