స్పోర్ట్స్ మీట్లో పోలీసుల ప్రతిభ
జిల్లాకు 4 బంగారు, 4 కాంస్య పతకాలు
విజేతలను అభినందించిన ఎస్పీ మహేష్
కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో జిల్లా పోలీసు సిబ్బంది మొత్తం 8 పతకాలు సాధించారు. వీటిలో 4 బంగారు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ విజయంపై జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సంతోషం వ్యక్తం చేస్తూ విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు పతకాలు అందజేశారు. క్రీడలు మానసిక దృఢత్వం, క్రమశిక్షణ టీమ్ స్పిరిట్‌ను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గెలుపోటములు సహజమని, విజేతలు జాతీయస్థాయిలో మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని సూచించారు. లాన్ టెన్నిస్ విభాగంలో జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ మధుకర్ కాంస్య పతకం సాధించగా, బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు కాంస్య పతకం అందుకున్నారు. టేబుల్ టెన్నిస్ విభాగంలో ఏఆర్ఎస్ఐ లు సత్యనారాయణ, ఆనంద్ కాంస్య పతకాలు సాధించారు. కాయకింగ్ విభాగంలో ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ సతీష్ 500 మీటర్స్ సింగిల్, 500 మీటర్స్ డబుల్స్, 200 మీటర్స్ సింగిల్ విభాగాల్లో బంగారు పతకాలు సాధించగా, గంగరాజు 500 మీటర్స్ సింగిల్, 500 మీటర్స్ డబుల్స్ విభాగాల్లో బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు.


