కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ ఆధ్వర్యంలో సభ్యులు బుధవారం ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ను కలిసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ దేశ సరిహద్దులో సైనికులు ఎంత ముఖ్యమో దేశంలో పోలీసు వ్యవస్థ అంతే అవసరం అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్న పోలీసు వ్యవస్థ సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు గంధం లాలయ్య, జిల్లా జనరల్ సెక్రెటరీ పాక ధర్మేశ్వరరావు, జాయింట్ సెక్రెటరీ గండి మురళి తదితరులు పాల్గొన్నారు.


