కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ కమటం సుధీర్ ను ఉత్తమ పోలీస్ సేవ పథకం వరించింది. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రం కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్,కలెక్టర్ లెనిన్ వత్సల్ టెప్పో, ఎస్పి సుధీర్ రామ్నాద్ కేకన్ చేతుల మీదుగా ఉత్తమ సేవా ప్రశంస పత్రం అందుకున్నారు.ఈ సందర్భంగా సుధీర్ ను ఎస్సై చిర్ర రమేష్ బాబు, పోలీస్ స్టేషన్ స్టాప్ అభినందించారు. ప్రశంసా పత్ర గ్రహీత సుధీర్ మాట్లాడుతూ ప్రశంసతో మరింత బాధ్యత పెరిగిందన్నారు.
నెల్లికుదురు పిసికి సుధీర్‌కు పోలీస్ సేవ పథకం..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


