పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి
ఏడుగురు జూదగాళ్లు అరెస్టు…రూ.3,490 నగదు స్వాధీనం
కాకతీయ, మణుగూరు : మణుగూరు మండల పరిధిలోని సమితి సింగారం ప్రాంత శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురు జూదగాళ్లను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మణుగూరు పోలీసులు ఓ ఇంటిపై మెరుపుదాడి నిర్వహించి జూదరులను పట్టుకున్నారు. సంఘటన స్థలంలో వారి వద్ద నుంచి రూ.3,490 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్రమ జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.


