epaper
Monday, March 2, 2026
epaper

పోలీస్ అంటే నమ్మకం

  • విధి నిర్వహణలో పారదర్శకత పాటించాలి
  • ఖాకీలంతా నైతిక విలువలు పెంపొందించుకోవాలి
  • అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం
  • ప్రమోద్​ కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేస్తాం
  • మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి
  • సీఎం రేవంత్​ రెడ్డి
  • పోలీసు అమ‌ర‌వీరుల‌కు ముఖ్య‌మంత్రి ఘ‌న నివాళి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : పోలీస్ అంటే సమాజానికి నమ్మకం, భరోసా అని, శాంతిభద్రతలు కాపాడటంలో ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. మన కోసం రక్తం అర్పించిన వీరులు ఎందరో ఉన్నారని, విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని సీఎం అన్నారు. హైదరాబాద్​లోని గోషామహల్​ పోలీస్​ గ్రౌండ్స్​లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. సైబర్​ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ ముందుందని వివరించారు. ఈక్రమంలోనే ఇటీవల అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారని, మిగతా మావోయిస్టులను కోరుతున్నానన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు.

పోలీసుల‌కు అండ‌గా ప్ర‌భుత్వం

1959 అక్టోబరు 21న భారత్​, చైనా సరిహద్దుల్లో 10 మంది జవాన్లు వీరమరణం పొందారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అప్పటి నుంచి ఏటా ఈరోజు పోలీసు అమరవీరులను స్మరించుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఆరుగురు పోలీసులు వీరమరణం పొందారని వెల్లడించారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇటీవల చనిపోయిన ప్రమోద్​ కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇంటిస్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

మన పోలీసులు దేశంలోనే అగ్రస్థానం

పలు విభాగాల్లో మన పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని సీఎం రేవంత్​రెడ్డి కొనియాడారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. డ్రగ్స్​ మహమ్మారిపై పోరాడేందుకు ఈగల్​ పేరుతో ప్రత్యేక బృందం నియమించామన్న ఆయన, సైబర్​, డిజిటల్​, మార్ఫింగ్​, డ్రగ్స్​లో కొత్త తరహా నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. టెక్నాలజీ రూపంలో వచ్చే నేరాలకు దాంతోనే సమాధానం చెబుతున్నామని స్పష్టం చేశారు.

జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి

“అనేక విభాగాలకు మహిళా ఐపీఎస్​లు సారథ్యం వహిస్తున్నారు. పోలీసు డ్యూటీ అంటే కత్తి మీద సాము లాంటిది. ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు తమ జీవితం త్యాగం చేస్తున్నారు. పోలీసు సంక్షేమం కోసం మా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రాజకీయ జోక్యం, ఒత్తిడి లేకుండా పని చేయాలని కోరాం. మా ప్రభుత్వం 16 వేల మంది కానిస్టేబుల్​, ఎస్​ఐ పోస్టులు భర్తీ చేసింది. పోలీసులకు ఏదైనా జరిగితే దేశంలోనే అత్యధిక పరిహారం ఇస్తున్నాం. పోలీసు పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశాం. పోలీసులు తమ విధి నిర్వహణలో పారదర్శకత, నైతిక విలువలు పాటించాలి. ఇలాగే పని చేస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని కోరుతున్నాను. శరవేగంగా అభివృద్ధి చెందే మన రాష్ట్రంలో శాంతిభద్రతలు చాలా కీలకం. సోషల్​ మీడియా యుగంలో పోలీసుల ప్రతి అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు చూడాలి.” – రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img