హోంగార్డుకి అండగా పోలీస్ కమిషనర్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో :
విధి నిర్వహణలో అనారోగ్యానికి గురై కంటి చూపు కొల్పోయిన హోం గార్డుకి కరీంనగర్ పోలిస్ కమిషనర్ గౌష్ అలాం అండగా నిలిచి మానవత్వంతో అర్ధిక సాయాన్ని అందించారు. అర్దిక సాయం అందించడమే గాక మెరుగైన వైద్యం అందెలా చేసి తిరిగి కంటి చూపు పోందేలా పోలిస్ కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వివరాలు ఇలా…కొత్త పల్లి పోలిస్ స్టేషన్ లో బ్లూ కొల్ట్స్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శివకూమార్ హైబీపీ కారణంగా కంటి చూపు కోల్పోయారు. శివకూమార్ కంటి చూపును తిరిగి తీసుకురావడానికి కరీంనగర్ లో చికిత్స చేసినా నయం కాలేదు. దీనితో మెరుగైన వైద్యం కొసం అతడిని హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలిస్ కమీషనర్ గౌష్ అలాం అశోక్ వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1.5లక్షల ఆర్దిక సహయాన్ని అందించారు. అంతే కాకుండా వైద్య సమయంలో పోలిస్ కమిషనర్ ప్రత్యేక చొరవతో అశోక్ మెరుగైన వైద్యం అందగా కొల్పోయిన కంటి చూపు తిరిగి వచ్చింది. కాగా పూర్తిగా కొలుకున్న అశోక్ శుక్రవారం రోజున తిరిగి విధులలో చేరాడు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లడుతూ..పోలీస్ కుటుంబంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా తాను అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


