కాకతీయ, గీసుకొండ: గత మూడు నెలలుగా వరుసగా జరిగిన దొంగతనాల కేసులను గీసుకొండ పోలీసులు ఛేదించారు. సీఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం…కోటగండి గుడి వద్ద వాహనాల తనిఖీలో అనుమానా స్పదంగా తిరుగుతున్న ముగ్గురిని ఎస్సై అనిల్‌కుమార్ పట్టుకుని విచారించగా, వారు కాశీబుగ్గకు చెందిన పల్లకొండ ఉపేందర్, కటకం ప్రణయ్, శివనగర్‌కు చెందిన పులిచెరు చంద్రశేఖర్‌లుగా గుర్తించారు.
వారు కట్ట మల్లన్న గుడి హుండీతో పాటు మచ్చాపూర్, ఆత్మకూర్ గ్రామాల్లోని పాన్‌షాప్‌లు, కిరాణా షాపులపై దాడి చేసి నగదు, సిగరెట్ డబ్బాలు ఇతర వస్తువులను దోచుకున్నట్లు ఒప్పుకోగా,వారి నుండి కొంత నగదు, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకొని, ముగ్గురినీ రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.


