కాకతీయ, ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ మండలంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు సీఐ పవన్ కుమార్ బృందం విశ్వసనీయ సమాచారంతో రైడ్ చేసి పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నగదు 7, 330 రూపాయలు, రెండు మొబైల్ ఫోన్లు, ప్లేయింగ్ కార్డులు స్వాధీన పరుచుకొని మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు. మిల్స్ కాలనీ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.


