కాకతీయ, తెలంగాణ బ్యూరో: నషా ముక్త్ భారత్ అభియన్ లో భాగంగా హైదరాబాద్ లోని డిజిపి కార్యాలయంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్( పి అండ్ ఎల్ ) శ్రీ ఎం. రమేష్ అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల హానికరమైన ప్రభావం నుండి సమాజాన్ని, ముఖ్యంగా యువతను రక్షించడానికి పోలీసు లు నిబద్ధతను పునరుద్ఘాటించడ కోసం ప్రతిజ్ఞ చేశారు .
ఈ సందర్భంగా ఐజిపి శ్రీ ఎం.రమేష్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల దుర్వినియోగం చేయడం వల్ల ప్రజారోగ్యం, భద్రత , యువతరం ల భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పు అని నొక్కి చెప్పారు. అవగాహన ప్రచారాలను ముమ్మరం చేయాలని, అమలు చర్యలను బలోపేతం చేయాలని, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని నిర్మూలించడానికి సమాజంతో కలిసి పనిచేయాలని ఆయన సిబ్బందిని కోరారు. ప్రతిజ్ఞ కార్యక్రమంలో శ్రీ ఎం. రమణ కుమార్, ఎఐజి (ఎల్ అండ్ ఓ), డి ఎస్ పి శ్రీ ఉదయ్ భాస్కర్ ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


