జమ్మికుంటపై గులాబీ జెండా ఖాయం
బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేత
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధీమా
కాకతీయ, జమ్మికుంట :జమ్మికుంట మున్సిపాలిటీపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేస్తూ, వారికి బీ–ఫారాలను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల విశ్వాసంతో మున్సిపాలిటీలో ఘన విజయం సాధిస్తామని, చైర్మన్ పీఠం బీఆర్ఎస్దేనని స్పష్టం చేశారు. గెలుపు తర్వాత అన్ని వార్డుల్లో సమగ్ర అభివృద్ధి చేపట్టి జమ్మికుంటను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులు:
1–పోలు దివ్య, 2–పొలానేని శిల్ప, 3–పూరెల్ల శ్రీనిధి, 4–పోలేని అజయ్ రావు,
5–యాట్ల జ్యోతి, 6–పొనగంటి విజయలక్ష్మి, 7–ఏబూసి ఆర్యన్ కౌశిక్,
8–కొలువురి సురేష్, 9–పొన్నగంటి రాము, 10–బిట్ల స్వరూప,
11–పొన్నగంటి సంపత్, 12–చుంచు రమాదేవి, 13–దయ్యాల సుజాత,
14–మైసా శిరీష, 15–తనుగుల తిరుమల, 16–కొలుగూరి సురంజన్,
17–పోడేటి రామస్వామి, 18–కూతాడి తిరుపతి, 19–ముంతాజ్ అలీ,
20–కొక్కుల శ్రీలత, 21–చింతల శ్రీనివాస్, 22–మంద రాధా,
23–తక్కలపల్లి రాధికా, 24–చిలివేరి స్వాతి, 25–బచ్చు మాధవి,
26–ముద్రగడ పద్మప్రియ, 27–గాజుల భాస్కర్, 28–చొప్పరి తిరుపతి,
29–లెంకలపల్లి అశోక్, 30–రామడుగు రవీందర్ రావు.
ఎన్నికల అనంతరం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.


