- మానసిక వైద్యురాలు బండి రాధికా రెడ్డి
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మానసికంగా దృఢంగా ఉంటేనే శరీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారని ప్రముఖ మానసిక వైద్యురాలు డాక్టర్ బండి రాధికా రెడ్డి తెలిపారు. లయన్స్ క్లబ్ మహబూబాబాద్ ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్య శ్రేయస్సు అవగాహన వారోత్సవం సందర్భంగా శనివారం మానుకోటలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో 2 కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా “మానసిక ఆరోగ్యం లేనిదే శారీరక ఆరోగ్యం లేదు “ అనే అంశంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బి. వీరన్న అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానసిక వైద్యురాలు మాట్లాడుతూ.. నిత్యం మన జీవనశైలిలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరు ఏదో విధంగా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత శరీరక వ్యాయామం చేసినా, ఫలితం ఉండదని పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యం మెరుగు పడాలంటే ముందుగా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మూఢనమ్మకాలను నమ్మవద్దని, అవసరమైతే మానసిక వైద్యులను సంప్రదించాలని సూచించారు.
వారి సలహాలు పాటించి మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలని డాక్టర్ రాధికా రెడ్డి చెప్పారు. డాక్టర్ వీరన్న మాట్లాడుతూ..ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, మానసిక ఆరోగ్య , శ్రేయస్సు అవగాహన వారోత్సవాలను అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ “ నో హెల్త్ వితౌట్ మెంటల్ హెల్త్ ” అనే నినాదంతో ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలను చేపడుతోందని వివరించారు.
ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ మాధపెద్ది వెంకట్ రెడ్డి, క్లబ్ కార్యదర్శి లయన్ పర్కాల రవీందర్ రెడ్డి, కోశాధికారి కొండపల్లి కరుణాకర్ రెడ్డి, , డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సభ్యులు అనుమాల వెంకటేశ్వర్లు, సీనియర్ బాధ్యులు డాక్టర్ వెనిగళ్ల జగన్మోహనరావు, ఘనపురపు అంజయ్య, బవిరిశెట్టి నాగేశ్వర్ రావు, మాలె కాళీనాథ్, పారుపల్లి రమేశ్, చౌడవరపు సుధాకర్, మహబూబాబాద్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డుపల్లి ఉపేంద్రం,అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కామ సంజీవరావు, మరిపెడ ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి, పరంధామయ్య, ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాలపిందెల మల్లయ్య, సెక్రటరీ ఆకుల శంబయ్య, వాకర్స్ కాఫీ క్లబ్ సభ్యులు ఆకుల రాజు, వంగ రామన్న, కొల్లూరు రవికుమార్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.


