కాకతీయ, రాయపర్తి /ఐనవోలు: ఆటలు శారీరకధృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి, మెరుగైన ఆరోగ్యం కలిగి ఉండేలా ఎంతగానో ఉపయోగపడతాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం పండుగను పురస్కరించుకొని ఐనవోలు మండల కేంద్రంలో క్రికెట్ టోర్నమెంటును ఆయన ప్రారంభించారు.
ఆట స్థలంలో బ్యాటు పట్టి యువకులతో క్రికెట్ ఆడి చూపరులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఆటలు ఆరోగ్యానికి ఎంతో మేలని, మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తాయన్నారు రు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
స్నేహితులు, బంధుమిత్రుల మధ్య ఆటలతో బలమైన సంబంధాలు ఏర్పడతాయని తెలిపారు. అలాగే వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గామాత అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


