ఎర్రబెల్లి స్వర్ణకు ఫోటో జర్నలిస్టుల అభినందనలు
కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణను ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్ సొసైటీ సభ్యులు గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టులు స్వర్ణకి పుష్ప గుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అలాగే, ఆమె బాధ్యతలు విజయవంతంగా నిర్వహించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ గోపరాపు శ్యామ్ కుమార్, అధ్యక్షులు సంపేట సుధాకర్, కార్యదర్శి బొల్లా అమర్‌తో పాటు కార్యవర్గ సభ్యులు బొడిగె శ్రీను, తోట తిరుమల్, చేతి శ్రీనివాస్, నామాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.


