కాకతీయ, కరీంనగర్: హైదరాబాద్‌లో జరిగే ఫోటో ఎక్స్పోలో పాల్గొనడానికి హుజురాబాద్, జమ్మికుంట మండల ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు శనివారం బయలుదేరారు.
హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో బృందం పయనమైంది. కాంగ్రెస్ నేతలు మేకల తిరుపతి, కొలుగూరి కిరణ్, సొల్లు బాబు, సుంకరి రమేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఫోటో ఎక్స్పోలో నూతన సాంకేతిక పరిజ్ఞానం, కెమెరాలు పరిచయం అవుతాయని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సభ్యులు మరింత రాణించాలని నాయకులు ఆకాంక్షించారు.


