పీజీ కళాశాల ఏర్పాటు చేయాలి
కాకతీయ తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నందు విలేఖరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు మాట్లాడారు. జిల్లాలోని రెండో అతిపెద్ద పట్టణమైన తొర్రూరులో పీజీ కాలేజీ లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల రహదారిలో సీసీ రోడ్లు వేయాలని కోరారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ తొర్రూర్ మండల అధ్యక్ష, కార్యదర్శులు బన్నీ, బోడపర్తి మహేష్, ఎండి అమీర్, మండల కమిటీ సభ్యులు శృతి, సాయి, మహేష్, అనిల్, యశ్వంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


