ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
కాకతీయ, కరీంనగర్ : వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న అర్హులైన బాధితులను ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్ఎఫ్) ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో మొత్తం 18 మందికి రూ. 6లక్షల 70 వేల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 846 మంది రోగులను సీఎంఆర్ఎఫ్ ద్వారా నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ ద్వారా సహాయం చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది అని పేర్కొన్నారు. చెక్కులు పొందిన లబ్ధిదారులు, జుట్టు లక్ష్మీనారాయణ, దారం స్రవంతి, దర్యపల్లి వాణి, పురుమల్ల శ్రీలత, ముజీబున్నీసా బేగం, యాసమీన్ ఫాదౌస్, గుర్రం సురేష్, యెన్నం మహిపాల్, సైద్ సుమర్, మహంకాళి ప్రసాద్, అహ్మద్ అలీ, భూలక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, మాచర్ల శేఖర్, సుతారి మల్లేశం, సయ్యద్ మస్తాన్, గుంటి మల్లయ్య, కిష్టయ్య.కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.


