- డీసీసీ ఎంపికలో నేతల అభిప్రాయం కీలకం
- ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్
కాకతీయ, వరంగల్ బ్యూరో : దేశవ్యాప్తంగా డీసీసీ (డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుల ఎంపికలో నేతల, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, ఏఐసీసీ నిర్ణయాలు తీసుకుంటుందని ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్ అన్నారు. హనుమకొండ, వరంగల్ పశ్చిమ నేతలతో జరిగిన సమీక్షలో జిల్లా, మండల, బ్లాక్ స్థాయి నాయకుల సూచనలు కీలకమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో గుజరాత్ వేదికగా ప్రారంభమైన కార్యక్రమం దేశవ్యాప్తంగా డీసీసీ ఎంపికకు మోడల్‌గా ఉంటుందన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజలకు బీఆర్ ఎస్ బాకీ కార్డు ప్రచారానికి ప్రతిస్పందనగా దోఖా కార్డు తో అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కె ఆర్ నాగరాజు, పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్, ఈవీ శ్రీనివాస్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


