epaper
Saturday, November 15, 2025
epaper

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ డా. సత్య శారద

కాకతీయ, వరంగల్ సిటీ : భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు జలమయమైన వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించారు. సమర్థవంతం గా చర్యలు చేపట్టాలంటూ అధికారులకు తగు సూచనలు చేశారు.

ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని నాలుగు మండలాలలైనా వరంగల్, సంగెం , ఖిలా వరంగల్, వర్ధన్నపేటలలో అత్యధిక వర్షపాతం నమోదయ్యిందని.. అత్యధికంగా సంగెం మండలంలో 24 సెంటీమీటర్ల వర్షపాతం, ఖిలా వరంగల్ మండలంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. లోతట్టు ప్రాంతాలైన సాయి గణేష్ కాలనీ, గాంధీ నగర్,డి కే నగర్,లెనిన్ నగర్, అగర్తల చెరువు ప్రాంతం, మైసయ్య నగర్, గిరి ప్రసాద్ కాలనీ, పద్మ నగర్, శాకారాశికుంట తదితర ప్రాంతాలను సందర్శించారు కలెక్టర్.

వర్షపు నీరు బయటకు వెళ్లే స్ట్రాం వాటర్ డ్రైన్ లు ఇరుకుగా ఉండడం వల్ల నీటి ప్రవాహంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఖిలావరంగల్ నుండి వరంగల్ వరకు జీ డబ్ల్యూ ఎం సి తరపున అట్టి నాలా ను విస్తరించడానికి పనులు కొనసాగుతున్నాయని, లోతట్టు ప్రాంతాలలో ఎమర్జెన్సీ ప్లాన్ కింద చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. మంగళవారం రాత్రి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితులు నేపథ్యంలో పిల్లలను పాఠశాలకు పంపించకూడదని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే క్రమంలో ప్రాణహాని ఉంటుందని కావున పిల్లలను చేపల వేటకు వెళ్లకుండా తల్లిదండ్రులు నియంత్రించాలన్నారు.

విద్యుత్ సంబంధ వస్తువులను తాగకుండా ఉండాలని.. వర్షాలు కురిసే క్రమంలో ఎర్తింగ్ వచ్చే అవకాశం ఉంటుందని భారీగా నీరు నిలిచి ఉండే లోతట్టు ప్రాంతాలకు విద్యుత్తు నిలిపివేయడం జరిగిందన్నారు. ఒకరోజు పునరావాస కేంద్రాలలో ఆవాసం పొందడం వల్ల కలిగే నష్టం ఏమీ లేదని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వారు అందజేసిన సాటిలైట్ ఇమేజ్ లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని సమాచారం అందిందని ప్రజలు అప్రమత్తం గా ఉండాలని కలెక్టర్ అన్నారు.

బల్దియా కమిషనర్ మాట్లాడుతూ జీ డబ్ల్యూ ఎం సి తరపున డి ఆర్ ఎఫ్ బృందాలు అప్రమత్తం గా ఉన్నాయని ప్రతి వార్డులో జవాన్ తో పాటు ప్రత్యేక మాన్ సూన్ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అంతే కాకుండా ఇంజనీరింగ్ బృందాలు కూడా క్షేత్ర స్థాయి లో సంసిద్ధం గా ఉన్నారని వర్షపు నీటిని వేగవంతంగా బయటకు పంపించడానికి కచ్చా కాలువల ద్వారా పంపించడం చేస్తున్నారన్నారు. శాశ్వత పరిష్కారం కోసం నాలా ను విస్తరించడం తో పాటు డ్రైన్ ఆక్రమణలను తొలగించడం జరుగుతుందన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సమీప ప్రాంతాల్లో ఉన్న పునరావాస కేంద్రాల్లోకి వెళ్లాలని ప్రస్తుతం 6 పునరావాస కేంద్రాలు ఎస్ ఆర్ నగర్ లో శుభం గార్డెన్,గాంధీ నగర్, మైసయ్య నగర్ కమ్యూనిటీ హాల్ లో,డి కే నగర్ లో బీరన్నకుంట హై స్కూల్ ,గిరి ప్రసాద్ నగర్ లోని కమ్యూనిటీ హాల్,ఏం ఎన్ నగర్ లోని మార్వాడీ హాల్ లో లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ప్రస్తుతం ఆయా కేంద్రాలలో ప్రజలు ఆవాసం పొందుతున్నారని.. ఉదయం సుమారు 1300 మందికి అల్పాహారం అందించినట్లు తెలిపారు. లంచ్ తో పాటు డిన్నర్ కూడా అందజేస్తామని ప్రజల అవసరాల కోసం వరంగల్, హన్మకొండ కలెక్టరేట్ లతో పాటు బల్దియా ప్రధాన కార్యాలయం లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ : 18004251980,మొబైల్ నంబర్: 9701999676 అందుబాటు లోకి తెచ్చామని ప్రజలు ఈ నంబర్ లలో సంప్రదించాలని జీ డబ్ల్యు ఎం సి తరఫున 2 డిఆర్ఎఫ్ బృందాలు 24×7 మూడు షిఫ్టులలో పనిచేస్తున్నాయని కమిషనర్ తెలిపారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యా రాణి,డి ఏం&హెచ్సాంబశివరావు ఎన్పిడిసిల్ ఎస్గౌతమ్ రెడ్డి, ఆర్ డిసత్యపాల్ రెడ్డి సి ఏం హెచ్డా.రాజారెడ్డి డి ఎఫ్శ్రీధర్ రెడ్డి, ఏం హెచ్డా.రాజేష్ సంతోష్ బాబు డిఎఫ్ ఓశంకర్ లింగం, తహసీల్దార్ లు మహమ్మద్ ఇక్బాల్ నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img