భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కంట్రోల్ రూమ్ నెంబర్ పై పత్రికా ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: తుఫాన్ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఏదైనా అత్యవసర పరిస్థితులు, సమస్యలకు వెంటనే కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1077 కు కాల్ చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఒక ప్రకటనలో కోరారు.వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కారణంగా మన ఖమ్మం జిల్లాలో అక్టోబర్ 29, 30 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. తుఫాన్ నేపథ్యంలో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, వరద సహాయక చర్యలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఏదైనా ప్రమాదాల్లో చిక్కుకుంటే వెంటనే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1077 కు ఫోన్ చేయాలని అన్నారు. వరదలు, భారీ వర్షాలకు సంబంధించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న వెంటనే కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1077, సెల్ ఫోన్ నెంబర్ 9063211298 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు అందించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


