కాకతీయ, ఆత్మకూరు : మొంథా తుఫాన్ వాళ్ళ గ్రామంలో చెరువు నిండి కట్ట పై నుంచి నీరు పోతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సతీష్ గ్రామా ప్రజలకు సూచించారు. గురువారం ఆత్మకూరు మండలంలోని నాగయ్యపల్లి చెరువును ఎస్సై సతీష్ సందర్శించి మాట్లాడారు మొంథా తుఫాను ఇంకా వచ్చే అవకాశం ఉందని ప్రజలు అవసరమైతే తప్ప బైటికి వెళ్లోద్దని గ్రామ ప్రజలకు సూచించారు. చిన్న పిల్లలను తల్లితండ్రులు భద్రంగా చూసుకోవాలని తల్లితండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


