పరకాల ప్రజలు కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్నారు
బీఆర్ఎస్ మోసాలను ప్రజలు గుర్తించారు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
కాకతీయ, పరకాల : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో కేవలం శంకుస్థాపనలు కాదు, అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా చేస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం పరకాలలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ కుసురు పాషా, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతితో కలిసి మాట్లాడారు. పరకాల మున్సిపల్ ఎన్నికల్లో 22 వార్డులను కైవసం చేసుకుని కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలకులు ఎన్నికల ముందు జీవోలు తెచ్చి శంకుస్థాపనలు చేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. గృహలక్ష్మి పథకం పేరుతో తమ సొంత కార్యకర్తలనే మభ్యపెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా వంటి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పరకాలను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తున్నామని, పెండింగ్ బిల్లులు చెల్లించి పనులు పూర్తి చేస్తున్నామని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.


