epaper
Tuesday, November 18, 2025
epaper

నషా ముక్త్ భారత్‌కు ప్రజలే బలం సీపీ అంబర్ కిషోర్ ఝా

నషా ముక్త్ భారత్‌కు ప్రజలే బలం సీపీ అంబర్ కిషోర్ ఝా
మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేసిన రామగుండం పోలీసు సిబ్బంది

కాకతీయ, రామగుండం : దేశాన్ని మాదకద్రవ్యాల ముప్పు నుంచి కాపాడేందుకు ప్రజల సహకారం అత్యంత కీలకమని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. “నషా ముక్త్ భారత్” లక్ష్యాన్ని సాధించడంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని, యువతను మత్తు పదార్థాల బారినపడకుండా కాపాడే బాధ్యత అందరిదేనని సీపీ పిలుపునిచ్చారు.కమీషనరేట్ కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని సీపీ ఝా ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్‌ వినియోగం యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టేస్తోందని, కుటుంబాలను కృంగదీస్తోందని, సమాజంలో సమస్యలు పెరిగేందుకు కారణమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల విక్రయం, సరఫరా, వినియోగం గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.యువతలో అవగాహన పెంచేందుకు స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై ప్రత్యేక నిఘా పెట్టి నేరస్థులను పట్టుకుంటున్నామని తెలిపారు. మత్తుకు బానిసలైన వారిని గుర్తించి కౌన్సిలింగ్‌కు హాజరుచేసి, అవసరమైతే రిహాబిలిటేషన్‌ కేంద్రాలకు పంపే చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్‌ నిర్మూలన కోసం మరింత కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు. నషా ముక్త్ భారత్ సాధనలో ప్రజలు, ముఖ్యంగా యువత చురుకుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఏవో శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్, చంద్రశేఖర్ గౌడ్, బాబురావు, నార్కోటిక్ వింగ్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ఆర్‌ఐలు శ్రీనివాస్, వామనమూర్తి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ నయవంచన పాలన‌

కాంగ్రెస్ నయవంచన పాలన‌ ఆరు గ్యారెంటీలు అన్‌గ్యారెంటీలుగా మారాయి 42% బీసీ రిజర్వేషన్ కూడా...

జాత‌ర‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు

జాత‌ర‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు గోలివాడలో సమ్మక్క సారలమ్మ జాతర పనులపై కలెక్టర్...

డ్రగ్స్ మూలాలను పెకిలించాలి కలెక్టర్ పమేలా సత్పతి

డ్రగ్స్ మూలాలను పెకిలించాలి కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలకు...

శీతాకాలపు పొగమంచులో జాగ్రత్త తప్పనిసరి

శీతాకాలపు పొగమంచులో జాగ్రత్త తప్పనిసరి సురక్షిత డ్రైవింగ్‌పై ప్రజలకు విజ్ఞప్తి కరీంనగర్ పోలీస్ కమిషనర్...

చదువు తో విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతుంది

చదువు తో విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతుంది ఫౌండేషన్ ఇంచార్జ్ బియ్యాల దినేష్ కాకతీయ,...

పత్తి రైతుల సమస్యలపై గలమెత్తిన గంగుల

పత్తి రైతుల సమస్యలపై గలమెత్తిన గంగుల సిసిఐ నిబంధనలు సడలించాలి మిల్లుల సమ్మె వెంటనే...

మహాత్మా నగర్‌లో శ్రీ అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ

మహాత్మా నగర్‌లో శ్రీ అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ 21 నుంచి మహోత్సవాలు కాకతీయ, కరీంనగర్...

23న చలో ఉట్నూర్ బహిరంగ సభను విజయవంతం చేయండి

23న చలో ఉట్నూర్ బహిరంగ సభను విజయవంతం చేయండి కాకతీయ, లక్షెట్టిపేట :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img