epaper
Monday, March 2, 2026
epaper

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోతోంది

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోతోంది
కేంద్ర నిధులను వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
త్వరలో జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆధునీకరణ
స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా
ప‌రిక‌రాల‌ను వాడుకొకుంటే వాప‌స్ తీసుకుంటాన‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూది, మందులు, దూది కూడా అందుబాటులో లేక ప్రజల్లో నమ్మకం తగ్గిపోతుందని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా భారీగా నిధులు ఇస్తున్నా వాటిని సరిగా వినియోగించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జమ్మికుంట ఏరియా ఆసుపత్రిని శనివారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పరిశీలించిన ఆయన రూ.1 కోటి విలువైన 15 అత్యాధునిక వైద్య పరికరాలను అందజేశారు. అనంతరం రోగులను పరామర్శించి అందుతున్న వైద్య సేవల గురించి సమాచారం తీసుకున్నారు. డాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆసుపత్రి సమస్యలపై సమగ్ర వివరాలు సేకరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందేది పేదలు, మధ్యతరగతి ప్రజలేనని వారికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునే స్థోమత లేకపోవడంతో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలపరచడం అవసరమని ఆయన స్పష్టం చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా వేములవాడ, జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్ ఆసుపత్రులకు ఎన్ఎండీసీ సీఎస్సార్ నిధులతో రూ.4 కోట్ల విలువైన పరికరాలను అందించానని తెలిపారు. జమ్మికుంట ఆసుపత్రికి అందించిన ఈసీజీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఆటోక్లేవ్, డయాథెర్మి, అనెస్థిషియా వర్క్‌స్టేషన్, ఎమర్జెన్సీ రికవరీ ట్రాలీ, సిరంజ్ పంప్ వంటి పరికరాలను రోగుల సేవలో వినియోగించాలని సూచించారు. పరికరాలు వాడకపోతే వాపస్ తీసుకుని ఇతర ఆసుపత్రులకు ఇస్తా అని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. త్వరలో ఎంపీ లాడ్స్ నిధులతో ఎక్స్‌రే యంత్రాన్ని కూడా అందజేస్తానని ప్రకటించారు. కొన్ని ఆసుపత్రుల్లో అంబులెన్సులు, పరికరాలు వాడకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. వేములవాడ, కరీంనగర్ ఆసుపత్రుల్లో పరికరాలు వాడకపోతే ఇప్పటికే వాపస్ తీసుకున్నట్టు గుర్తుచేశారు.

చెక్‌డ్యామ్‌లు క‌మిష‌న్ల కోసం నిర్మిస్తున్నారు

చెక్‌డ్యాం కూలిపోయిన ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ చెక్‌డ్యామ్‌లు ప్రజలకోసం, రైతులకోసం నిర్మించే పనులు కాకుండా కమీషన్ల కోసం చేస్తున్న నిర్మాణాలుగా మారిపోయాయని ఘాటుగా విమర్శించారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం రెండింటి కాలంలోనూ బడా కాంట్రాక్టర్లకు బిల్లులు నిరవధికంగా చెల్లిస్తూనే ఉన్నారని నాసిరకం పనులు చేస్తున్నప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణాళిక, నాణ్యత లేని పనుల కారణంగానే చెక్‌డ్యాం లు వరుసగా కూలిపోతున్నాయని తెలిపారు. గత ఆరు నెలలుగా ఈ సమస్యలపై నిరంతరం ఫిర్యాదులు వస్తున్నప్పటికీ చర్యలు తీసుకునే ప్రయత్నం కూడా లేదని ఆయన విమర్శించారు. సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో ఇదే తరహా ఘటనలు గతంలోనూ జరిగినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే చెక్‌డ్యాం కూలిపోయిన ఘటనలపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ల ఆస్తులను కూడా సీజ్ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అప్పుడు మాత్రమే భవిష్యత్తులో ఇలాంటి పనులకు నియంత్రణ ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన కొందరు అధికారులను కూడా పైసలు తీసుకుని ప్రస్తుత ప్రభుత్వం కీలక పదవుల్లో కొనసాగిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కమీషన్ల గురించే ఆలోచిస్తోందని ప్రజల ప్రయోజనాలు మాత్రం పూర్తిగా విస్మరించబడుతున్నాయని మండిపడ్డారు. అలాగే జమ్మికుంట అభివృద్ధిపై మాట్లాడుతూ జ‌మ్మికుంట‌ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం, రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ రెండు పనులు త్వరలోనే పూర్తవుతాయని ఆయన హామీ ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img