పెన్షనర్లకు నగదు రహిత వైద్యం కల్పించాలి
కాకతీయ, మరిపెడ : పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలు తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాయిత వీరయ్య డిమాండ్ చేశారు. శనివారం పెన్షనర్స్ డే సందర్భంగా మరిపెడలో డి.ఎస్. నకారా చిత్రపటానికి నివాళులు అర్పించి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు విడతల డీఏ పెండింగ్ వెంటనే విడుదల చేయాలని, పీఆర్‌సీ ప్రకటించాలని కోరారు. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నా నగదు రహిత వైద్యం లేక పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స, మెడికల్ బిల్లుల సత్వర పరిష్కారం చేయాలని సూచించారు. టీజీ ఆర్టీసీలో సీనియర్ సిటిజన్లకు 50 శాతం రాయితీ కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


