- సీపీ గౌస్ ఆలం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ టౌన్ డివిజన్ ఏసీపీ కార్యాలయాన్ని బుధవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించి, వాటిని తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్బన్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కమిషనర్ మాట్లాడుతూ రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని, ప్రతి నెలా వారిపై తాజా సమాచారాన్ని సేకరించి నమోదు చేయాలని తెలిపారు.
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వారెంట్లను తక్షణమే అమలు చేయాలని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ హోల్స్‌ను గుర్తించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి, ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, పేకాట స్థావరాలను గుర్తించి, సంబంధిత వారిపై కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ రామ్‌చందర్ రావు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి, ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీలత, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


