కాకతీయ, నల్లబెల్లి: గత సంవత్సరం దసరా ఉత్సవాల సమయంలో నల్లబెల్లి మండల కేంద్రంలో చోటు చేసుకున్న గొడవల నేపథ్యంలో, ఈ ఏడాది అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రోజు నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ఏసీపీ నర్సంపేట, సీఐ దుగ్గొండి హాజరై, దసరా ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు.
అధికారులు ఉత్సవాల సందర్భంగా ఎవ్వరూ చట్టాన్ని ఉల్లంఘించకూడదని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ సమానంగా పండుగను జరుపుకోవాలని, సామాజిక సమరతకు అవకాశం కల్పించాలని వారు అన్నారు.


