పీడీఎస్ బియ్యం పట్టివేత
కాకతీయ, నర్సింహులపేట : ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్నలారీలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. దంతాలపల్లి ఎస్ఐ పిల్లల రాజు తెలిపిన వివరాల ప్రకారం దంతాలపల్లి శివారు రాజస్థాన్ దాబా వద్ద దంతాలపల్లి పోలీస్, జిల్లా సివిల్ సప్లై అధికారులు కలసి తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రమంలో సుమారు 200 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వారు వెల్లడించారు. ఖమ్మం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న సంబంధిత వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.


