నకిలీ విత్తన, పురుగుమందుల విక్రేతపై పీడీ యాక్ట్
కాకతీయ, వరంగల్ బ్యూరో : నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించిన వ్యక్తిపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. మెహదీపట్నం ప్రాంతానికి చెందిన ముద్దంగుల ఆదిత్య, కాలం తీరిన పురుగు మందులు, నకిలీ విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై పరకాల పోలీసులు జూన్ 6న అరెస్ట్ చేశారు. నిందితుడు మరో ఆరుగురితో కలిసి ముఠా ఏర్పరచుకుని, డీలర్ల నుంచి తక్కువ ధరలకు కాలం చెల్లిన పురుగు మందులు కొనుగోలు చేసి రైతులకు మోసపూరితంగా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ ముఠా నుండి పోలీసులు రూ.63,62,200 విలువైన నకిలీ విత్తనాలు, పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇంతకుముందు మట్టెవాడ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు, పరకాల పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదయ్యాయి. పరకాల ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, పీడీ యాక్ట్ ఉత్తర్వులను జైలులో నిందితుడికి అందజేయగా చర్లపల్లి జైలుకు తరలించారు. రైతులను మోసం చేసే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.
నకిలీ విత్తన, పురుగుమందుల విక్రేతపై పీడీ యాక్ట్
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


