కొండగట్టులో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం
కాకతీయ, కొండగట్టు : మల్యాల మండలం కొండగట్టులో గురువారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.కొండగట్టు దేవస్థాన అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ద్వారా నిధులు మంజూరు కావడంలో పవన్ కళ్యాణ్ చేసిన కృషికి కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారు పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బద్ధం తిరుపతిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కొండబత్తిని త్రినాథ్, సామ మైపాల్ రెడ్డి, గుర్రం మల్లేశం గౌడ్, జలంధర్ రెడ్డి, పంజాల మల్లేశం గౌడ్, పులి అంజయ్య గౌడ్, పొన్నగంటి గౌతం, శ్రీధర్, నేరెళ్ల వినయ్, ఏలేటి హరి, పొన్నగంటి విష్ణువర్ధన్, కొంక ముత్యం తదితరులు పాల్గొన్నారు.


