కాకతీయ, ఆత్మకూరు: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు ప్రవేశపెట్టిన రిజర్వేషన్లతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరాశలు చెందినట్టు మండలంలో జోరు చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో గత పది సంవత్సరాలు పార్టీ కొరకు కష్టపడి సరైన గుర్తింపు లేని నాయకులు స్థానిక ఎన్నికల్లోనైనా గుర్తింపు వస్తదేమో అని ఆశలు పెట్టుకున్న కొందరి నాయకులకు ఈ రిజర్వేషన్లతో ఊహించని షాక్ తగిలిందని చెప్పవచ్చు.
ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా ఆ పార్టీ కోసం కష్టపడ్డా నాయకులు స్థానిక ఎన్నికల్లోనైనా పోటీ చేయాలనీ చాల మంది నాయకులు ఆశతో ఈ రిజర్వేషన్ల కొరకు వేచి చూసారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చేదు అనుభవం ఎదురైందని మండల ప్రజలు చర్చలు జరుపుతున్నారు.
స్థానిక ఎన్నికల భరిలో కొందారు నాయకులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్లతో పార్టీ నాయకులు నిరాశలు చెందినట్టు విశ్వనీయ సమాచారం ఈ నిరాశతో స్థానిక ఎన్నికల్లో మూడు పార్టీలు ముందుకు సాగేనా అని కొందరు పార్టీ కార్యకర్తలు, నాయకులు సందిగ్ధంలో ఉన్నట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా ఆత్మకూర్ మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల్లో గత మూడేళ్లుగా ఒక ఆనవాయితీ జరుగుతుంది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాకుండా ప్రతిపక్ష పార్టీల జెండా సర్పంచ్ ఎన్నికల్లో ఎగురుతుందని ఆత్మకూరు గ్రామా ప్రజలు చర్చలు జరుపుతున్నారు. మరి ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో ఆత్మకూరు గ్రామా ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబెడతారు వేచి చూడాలని గ్రామా ప్రజలు ఉత్కంఠంగా వేచి చూస్తున్నారు ..


