కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండల ఎంపీడీవో గా విధులు నిర్వర్తించిన హరిప్రసాద్ ప్రమోషన్ పై బదిలీ కావడంతో మహబూబాబాద్ ఎంపీవోగా విధులు నిర్వహిస్తున్న పార్థసారథి ఇనుగుర్తి ఇంచార్జ్ ఎంపీడీవో గా శనివారం అదనపు బాధ్యతలు చేపట్టారు. దీంతో వివిధ గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు గోపు లక్ష్మీకాంత్, గండు వినోద్, గండు అనిల్ కుమార్ బొమ్మెరవాణి, రాజేష్, అశోక్, ముఖేష్ ఆఫీస్ స్టాఫ్ వివేక్, ప్రణీత్, సతీష్ లు ఎంపీడీవోను శాలువాతో ఘనంగా సన్మానించారు.


