మహా రుద్రయాగ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి…
కాకతీయ, పరకాల: బుధవారం పరకాల పట్టణ కేంద్రంలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నవంబర్ 17 న (సోమవారం) రోజు నిర్వహించనున్న మహా రుద్రయాగ ఏర్పాట్లను అధికారులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే రేవూరి అధికారులు, నిర్వాహకులు, సేవా సంస్థల ప్రతినిధులతో ఏర్పాట్లపై సమీక్షించి యాగ శాల,భక్తుల వసతి, పార్కింగ్, తాగునీటి, ఫైర్ సేఫ్టీ,అన్నదానం,వంటి సదుపాయాలను సక్రమంగా ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు.యాగం ఘనంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన సహకారాలు అందజేస్తానని అన్నారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.కావున భక్తులు అధిక సంఖ్యలో ఈ మహా రుద్రయాగ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో పరకాల ఆర్డీవో డాక్టర్ కన్నం నారాయణ, మున్సిపల్ కమిషనర్ కె సుష్మ, ఎమ్మార్వో విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కట్కూరి దేవేందర్ రెడ్డి, కొయ్యడ శ్రీనివాస్, పర్నెం మల్లారెడ్డి, పాడి ప్రతాపరెడ్డి, మడికొండ సంపత్ కుమార్, కొలుగూరి రాజేశ్వరరావు,ఆలయ కమిటీ సభ్యులు,పూజరులు, తదితరులు పాల్గొన్నారు.


