పంచాయతీ ఎన్నికలు నిఖార్సుగా జరగాలి
: కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు ఆదేశించారు. బుధవారం ఆమె కరీంనగర్ రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌తో పాటు కొత్తపల్లి మండలానికి సంబంధించిన ఎలగందల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను సందర్శించారు.ప్రతి కౌంటర్‌లో ఏర్పాటు జరిగిన సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్, పోలింగ్‌కు వెళ్లనున్న సిబ్బందితో మాట్లాడి, ఎన్నికల సామగ్రిని చెక్‌లిస్ట్ ప్రకారం తప్పకుండా ధృవీకరించుకోవాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సిబ్బందికి స్పష్టం చేశారు.పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజన సౌకర్యాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. రూట్, జోనల్, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించాలని సూచించారు.కలెక్టర్‌తో పాటు జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జడ్పీ సీఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


