జోనల్ స్పోర్ట్స్ మీట్‌లో పాలకుర్తి విద్యార్థుల విజయం
కాకతీయ,తుంగతుర్తి : సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ ఉత్తేజభరితంగా పోటీ పడ్డారు. విభిన్న వయోపరిమితి విభాగాల్లో ఉత్కంఠభరిత పోటీలు జరగగా, పాలకుర్తి గురుకుల పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపి ఓవరాల్ చాంపియన్ కప్‌ను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థిని లావణ్య మాట్లాడుతూ, “జోనల్ స్థాయిలో గెలిచి ఛాంపియన్ టైటిల్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని. ఈ క్రీడలు మాకు స్నేహభావం, క్రమశిక్షణ, స్ఫూర్తిని పెంపొందించాయని. కోకో, వాలీబాల్, కబడ్డీ వంటి ఆటల్లో మా టీమ్ శ్రమ ఫలించింది” అని అన్నారు.
ఫలితాలు ఇలా ఉన్నాయి:
అండర్ 14 విభాగం:
కబడ్డీ — 1వ బహుమతి: పాలకుర్తి, రన్నర్‌అప్: వలిగొండ
కోకో — 1వ బహుమతి: పాలకుర్తి, రన్నర్‌అప్: అడ్డగూడూర్
అండర్ 17 విభాగం:
కబడ్డీ — 1వ బహుమతి: జాజిరెడ్డిగూడెం, రన్నర్‌అప్: తుంగతుర్తి
కోకో — 1వ బహుమతి: తుంగతుర్తి, రన్నర్‌అప్: అడ్డగూడూర్
వాలీబాల్ — 1వ బహుమతి: పాలకుర్తి, రన్నర్‌అప్: ఆలేర్
అండర్ 18 విభాగం:
కబడ్డీ — 1వ బహుమతి: వలిగొండ, రన్నర్‌అప్: అడ్డగూడూర్
కోకో — 1వ బహుమతి: అడ్డగూడూర్, రన్నర్‌అప్: వలిగొండ
వాలీబాల్ — 1వ బహుమతి: పాలకుర్తి, రన్నర్‌అప్: అడ్డగూడూర్
ఈ క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించిన తుంగతుర్తి గురుకుల పాఠశాల సిబ్బందిని అధికారులు అభినందించారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, జట్టు భావన పెంపొందించడమే ఈ మీట్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.


