epaper
Sunday, March 1, 2026
epaper

ఎన్డీఎంఏ సేవలు భేష్

  • ఎన్డీఆర్ఎఫ్ సేవలపై ప్రజల్లో విస్త్రత అవగాహన కల్పించండి
  • ‘సచేత్’ యాప్ పై అవ‌గాహ‌న క‌ల్పించాలి
  • ప్ర‌తి ఒక్క‌రూ డౌన్ లోడ్ చేసుకునేలా ప్రచారం చేయండి
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
  • ఢిల్లీలోని ఎన్డీఎంఏ ప్రధాన కార్యాలయం సంద‌ర్శ‌న‌
  • సంస్థ అందిస్తున్న సేవలపై ఆరా..

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : జాతీయ విపత్తుల నిర్వహణ సేవల్లో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అగ్రస్థానంలో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జాతీయ విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందిస్తున్న సేవలతోపాటు జాతీయ విపత్తుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు విస్త్రతంగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను కోరారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘సచేత్ యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకునేలా చైతన్యం కలిగించాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బందికి క్లిష్టమైన సమయాల్లో రోప్స్, గ్యాస్ కట్టర్స్, జాకెట్ వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని కోరారు.

అధికారుల‌కు దిశానిర్దేశం

న్యూఢిల్లీలోని ఎన్డీఎంఏ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ) సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. ఈ సందర్బంగా ఎన్డీఎంఏ ఉన్నతాధికారులతో సమావేశమై సంస్థ అందిస్తున్న సేవలను, చేపడుతున్న కార్యాచరణను అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఎంఏ సేవలకు సంబంధించి కేంద్ర మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ప్రధానంగా తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ వరదల (2025)తోపాటు సిక్కిం వరదలు, వయనాడ్ ల్యాండ్స్‌లైడ్, హిమాచల్ వరదల సమయంలో, బాలాసోర్ రైల్వే ప్రమాదం (2023), సిల్క్యారా టన్నెల్ రక్షణ చర్యల్లో(2023) భాగంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందించిన సాహసోపేత చర్యలను వివరించారు.

14 దేశాలతో అంతర్జాతీయ ఒప్పందాలు

విపత్తు సేవలు అందించే విషయంలో జపాన్, రష్యా, జర్మనీ, మాల్దీవులు, చిలీసహా 14 దేశాలతో అంతర్జాతీయ అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. అత్యధిక వర్షాలు, వరదలు, విపత్తులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు ‘సచేత్ యాప్ ను రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 13.9 లక్షల డౌన్ లోడ్స్ చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా ఎక్కడ ఏ విపత్తు వచ్చే అవకాశం ఉందనే సమాచారం ప్రజలకు తెలుస్తుందని, తద్వారా ఆ విపత్తు నుండి బయటపడే అవకాశాలు ఉంటాయని సంజ‌య్ తెలిపారు.

సరైన ప్రచారం లేదు..

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అద్బుతమైన సేవలు అందిసున్నప్పటికీ సరైన ప్రచారం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తుఫానులు, వరదలుసహా పెను ప్రమాదాలు ఏర్పడిన సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సాహసోపేత సేవలు అందిస్తున్న విషయంపై ప్రజల్లో విస్త్రత అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్యంగా సచేత్ యాప్ ను దేశ పౌరులంతా డౌన్ లోడ్ చేసుకునేలా విస్త్రత అవగాహన కల్పించాలని సూచించారు. రెస్క్యూ సిబ్బందికి జాకెట్, రోప్స్, గ్యాస్ కట్టర్స్ వంటి మౌలిక సదుపాయాలను కచ్చితంగా సమకూర్చాలన్నారు. దిశ మీటింగ్ లో ఎన్డీఎంఏ సేవలను ఒక అంశంగా చేర్చే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. అంతిమంగా “ప్రతి భారతీయుడు – ప్రతి విపత్తుకూ సిద్ధంగా ఉండేలా సంసిద్దులను చేయాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img