epaper
Sunday, November 16, 2025
epaper

పద్మశాలి కార్తీకమాస వనభోజనం…

పద్మశాలి కార్తీకమాస వనభోజనం…

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, మేయర్…

కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ చింతల్ గ్రౌండ్ లో ఆదివారం పద్మశాలి కార్తీకమాస వనభోజన మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమ నిర్వాహకులు, ప్రజలు మంత్రిని సాదరంగా ఆహ్వానించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి సురేఖ ను నిర్వాహకులు శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ పూర్వీకులు మన ప్రయోజనాలను కోరి అనేక ఆచారాలను, సంప్రదాయాలను ఏర్పరిచారని, సామూహిక జీవన విధానాన్ని అలవాటు చేసే వన భోజన కార్యక్రమం అలాంటిదేనని అన్నారు. వన భోజనాలకు వచ్చిన వారికి పేరుపేరునా మంత్రి సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. ఆ రోజుల్లో ప్రజలు ఆధ్యాత్మిక, సామాజిక ప్రయోజనాలను ఆశించి వన భోజనాలు జరుపుకునేవారని అన్నారు. కానీ కాల క్రమంలో కులాల వారీగా వన భోజనాలు జరుపుకునే ఆచారం వచ్చిందని తెలిపారు. ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరూ సహకరించుకుంటూ పోతే ప్రజల మధ్య సహృద్భావ సంబంధాలు పెంపొంది వసుదైక కుటుంబంగా వర్ధిల్లుతాతమనీ, సత్సంబంధాలు పెరిగి ఉన్నతంగా ఎదగడానికి తోడ్పడుతుందని మంత్రి సురేఖ తెలిపారు. వన భోజనాలతో ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరిగి, వైవాహిక సంబంధాలతో కుటుంబ బంధాలు మరింత బలపడతాయని మంత్రి అన్నారు. వన భోజనాల తర్వాత కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించుకోవడం అభినందనీయమని మంత్రి సురేఖ పేర్కొన్నారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

హన్మకొండ జిల్లాకు 2.25 కోట్ల చేప పిల్లలు..

హన్మకొండ జిల్లాకు 2.25 కోట్ల చేప పిల్లలు.. మత్స్యకారుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం.. ధర్మసాగర్...

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కాకతీయ, ఇనుగుర్తి: మండలం లోని కోమటిపల్లి గ్రామానికి...

మార్కండేయ ఆలయంలో మహా అన్నదానం

మార్కండేయ ఆలయంలో మహా అన్నదానం నాగయ్య శాస్త్రి మంత్రోచ్ఛరణ లతో ప్రత్యేక పూజలు కాకతీయ,నెల్లికుదురు:...

అర్చకుల సూచనలు తీసుకుంటూ జాతర ఏర్పాట్లు..మంత్రి సీతక్క

అర్చకుల సూచనలు తీసుకుంటూ జాతర ఏర్పాట్లు..మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి: శ్రీ...

రామాలయంలో కార్తీక వన భోజనాలు

రామాలయంలో కార్తీక వన భోజనాలు ఆలయ ప్రాంగణంలో సకల దేవత పారాయణం ప్రధాన అర్చకులు...

కొత్తూరు ఉద్యోగ సంఘాల పాత్ర అభినందనీయం

కొత్తూరు ఉద్యోగ సంఘాల పాత్ర అభినందనీయం ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక చేయూతనందిస్తూ...

కార్యకర్తలకు అండగా సేవాదళ్

కార్యకర్తలకు అండగా సేవాదళ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దుగ్గొండి మండల కాంగ్రెస్...

తూర్పుకోటలో యువత పాత్రపై అవగాహన సదస్సు

తూర్పుకోటలో యువత పాత్రపై అవగాహన సదస్సు సమాజ నిర్మాణములో యూవత పాత్ర అగ్రస్థానం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img