epaper
Saturday, March 14, 2026
epaper

అశ్వాపురంలో ఆక్సిజన్–18 మెగా ప్లాంట్

అశ్వాపురంలో ఆక్సిజన్–18 మెగా ప్లాంట్
రూ.160 కోట్ల పెట్టుబ‌డి.. 100 కిలోల ఉత్ప‌త్తి సామర్థ్యం
దేశీయ అవసరాలతో పాటు ఎగుమతులకు బాట
31న ఏఈసీ ఛైర్మన్ అజిత్‌కుమార్ మొహంతి చేతుల మీదుగా ప్రారంభం

కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రం మరో కీలక జాతీయ ప్రాజెక్ట్‌కు వేదిక కాబోతోంది. ఇప్పటికే ఉన్న భారజల ప్లాంట్‌కు అనుబంధంగా ఆక్సిజన్–18 మెగా ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం సిద్ధమైంది. సుమారు రూ.160 కోట్ల వ్యయంతో, 100 కిలోల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. జనవరి 31న అజిత్‌కుమార్ మొహంతి, భారత అణుశక్తి కమిషన్ (ఏఈసీ) ఛైర్మన్ ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసే ఆక్సిజన్–18 దేశీయ అవసరాలను తీర్చడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసే అవకాశం కూడా కల్పించనుంది. వైద్య, శాస్త్రీయ పరిశోధన రంగాల్లో ఆక్సిజన్–18కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ మెగా ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేశారు. అశ్వాపురంలో ఆక్సిజన్–18 ఉత్పత్తి ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే 2022లో రూ.50 కోట్ల వ్యయంతో, 10 లీటర్ల సామర్థ్యంతో తొలి ఆక్సిజన్–18 ప్లాంట్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు. అది విజయవంతంగా కొనసాగుతోంది. ఆ ప్రాజెక్ట్‌తో అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, ఇజ్రాయెల్, రష్యాల సరసన భారత్ ఆక్సిజన్–18 ఉత్పత్తి చేసే ఆరో దేశంగా నిలిచింది. ఆ అనుభవాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు భారీ స్థాయిలో కొత్త ప్లాంట్‌కు శ్రీకారం చుట్టారు.

క్యాన్సర్ చికిత్సలో కీలక పాత్ర

ఆక్సిజన్ ఐసోటోపుల్లో 16, 17, 18 రకాలు ఉండగా, సాధారణ నీటిలో ఆక్సిజన్–18 కేవలం 0.2 శాతం మాత్రమే ఉంటుంది. ప్రత్యేక సాంకేతిక విధానాలతో దీన్ని 95.5 శాతం స్వచ్ఛత వరకు పెంచుతారు. ఈ ఐసోటోపు క్యాన్సర్‌ను గుర్తించడంలో కీలకమైన ట్రేసర్‌గా పనిచేస్తుంది. అమెరికా, ముంబైలో జరిగిన తాజా పరిశోధనల్లో క్యాన్సర్ చికిత్సలో దీని ప్రాధాన్యత స్పష్టమైంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక గ్రాము ఆక్సిజన్–18 ధర రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది. అశ్వాపురంలో 100 కిలోల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్ ఏర్పాటుతో దేశీయ అవసరాలు తీరడమే కాకుండా, విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించే అవకాశాలు కూడా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి, ఏజెన్సీ ప్రాంతంలో ఈ మెగా ప్రాజెక్ట్ స్థాపనతో అశ్వాపురం అణుశక్తి, వైద్య పరిశోధనల కేంద్రంగా మరింత గుర్తింపు పొందనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఫుడ్ పాయిజన్ ఘటనపై చర్యలు

ఫుడ్ పాయిజన్ ఘటనపై చర్యలు డిప్యూటీ వార్డెన్, హెచ్‌ఎం సస్పెన్షన్ కలుషిత ఆహారంతో విద్యార్థినులు...

డబ్బులు ఇస్తేనే పట్టా పాస్‌బుక్..!

డబ్బులు ఇస్తేనే పట్టా పాస్‌బుక్..! దళారుల ద్వారా డబ్బుల వసూళ్లు ఎకరానికి 25...

ప్రగతి విద్యాలయంలో ఘనంగా ఫేర్వెల్ డే

ప్రగతి విద్యాలయంలో ఘనంగా ఫేర్వెల్ డే ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థులు కాకతీయ, కూసుమంచి:...

చిన్నారులకు పాదరక్షల పంపిణీ

చిన్నారులకు పాదరక్షల పంపిణీ కోయగట్టు అంగన్వాడిలో సేవా కార్యక్రమం నిరుపేద విద్యార్థులకు చెప్పులు అందజేత కాకతీయ...

వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం

వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం ప్రభుత్వ గడువుకు ముందే పట్టాల పంపిణీ మంత్రుల చొరవతో వెలుగుమ‌ట్ల‌...

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి కూసుమంచి మండలంలో అమానుష ఘటన ఫోక్సో చట్టం కింద...

కూల్చిన చోటే పట్టాల పంపిణీ..!

కూల్చిన చోటే పట్టాల పంపిణీ..! భూదాన్ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు వెలుగుమట్ల భూదాన్...

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా తాగునీరు పారిశుధ్యం పై దృష్టి సారిస్తా రేగళ్ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img