మానవత్వం చాటుకున్న ఓన్ ప్లేట్ డ్రైవర్లు….
కాకతీయ, హన్మకొండ : ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్దే ఉంటున్న హనుమకొండ లోని బాలసముద్రం కు చెందిన డ్రైవర్ రాళ్లబండి యకాంబరంచారి కి ఓన్ ప్లేట్ డ్రైవర్ మిత్ర బృందం తరపున 19వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. పల్లెర్ల యాకుబ్ అధ్యక్షతన తన డ్రైవర్ల
మిత్రబృందంతో కలిసి సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి అశోక్ ఎం మహేష్ వి నవీన్ కృష్ణ ఎస్ చిరంజీవి ఎం రమేష్ ఏ రాజేందర్ సిహెచ్ రంజిత్ బి విజయ్, డీజే నరేష్, ఏ గణేష్, ప్రవీణ్, సురేష్, జి పరశురాములు, ఎస్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


