epaper
Monday, March 2, 2026
epaper

44 వేలకుపైగా అక్రిడిటేషన్ కార్డులు

44 వేలకుపైగా అక్రిడిటేషన్ కార్డులు
అర్హులందరికీ అక్రిడిటేషన్ అందిస్తాం
జి.ఓ. 103తో ప్రక్రియలో కీలక సవరణలు
ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాకు సమాన ప్రాధాన్యం
జిల్లా, మండల స్థాయి జర్నలిస్టులకు పెద్ద ఎత్తున అవకాశాలు
మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ సిహెచ్. ప్రియాంక, ముఖ్యమంత్రి సీపీఆర్‌వో జి. మల్సూర్‌లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ విధానం, కమిటీ ఏర్పాటు, పారదర్శక ప్రక్రియ అమలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి దిశానిర్దేశం చేశారు.

జి.ఓ. 103తో విస్తృత అవకాశాలు

అక్రిడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం ముందుగా జి.ఓ. 252ను జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం జర్నలిస్టు సంఘాల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులతో జి.ఓ. 103ను విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈ సవరణలతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44,706 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. గతంలో సుమారు 23 వేల మందికి మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు ఉండగా, తాజా నిర్ణయంతో దాదాపు 21 వేలకుపైగా కొత్త కార్డులు అదనంగా మంజూరు కానున్నట్లు మంత్రి వివరించారు. దీంతో జిల్లాలు, మండలాలు, నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది.

అన్ని మీడియా విభాగాలకు ప్రాధాన్యం

ప్రింట్ మీడియా విభాగంలో 2.50 లక్షలకుపైగా సర్క్యులేషన్ ఉన్న 8 పత్రికలకు 6,256 కార్డులు, 75 వేల నుంచి 2.50 లక్షల వరకు సర్క్యులేషన్ ఉన్న 24 పత్రికలకు 17,784 కార్డులు కేటాయించారు. అలాగే 25,001 నుంచి 75 వేల వరకు సర్క్యులేషన్ ఉన్న 30 పత్రికలకు 3,390, 15,001 నుంచి 25 వేల వరకు సర్క్యులేషన్ ఉన్న 169 చిన్న పత్రికలకు 11,661 కార్డులు మంజూరు చేశారు. 15 వేలలోపు సర్క్యులేషన్ ఉన్న 113 పత్రికలకు 226, పీరియాడికల్స్‌కు 624, 20 న్యూస్ ఏజెన్సీలకు 68 అక్రిడిటేషన్ కార్డులు కేటాయించారు. ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో 21 శాటిలైట్ ఛానళ్లకు 4,431 కార్డులు, 8 జాతీయ ఛానళ్లకు 32, 100 లోకల్ కేబుల్ ఛానళ్లకు 200 కార్డులు కేటాయించారు. డిజిటల్ మీడియా విభాగానికి కూడా 10 అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేశారు. మొత్తం కార్డుల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో 16,056 కార్డులు, నియోజకవర్గ, మండల స్థాయిలో 28,650 కార్డులు ఇవ్వనున్నారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. అవసరాన్ని బట్టి మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన మీడియా ప్రతినిధుల గౌరవం, భద్రత, సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img