epaper
Monday, March 2, 2026
epaper

మా ఉసురు తగిలింది…!

మా ఉసురు త‌గిలింది..!
అద‌న‌పు క‌లెక్ట‌ర్ వెంక‌ట్‌రెడ్డికి రైతుల శాపాలు
గ్రీన్‌ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న మాకు న్యాయం చేయలేదు
క‌నీసం మార్కెట్ రేటు కూడా చెల్లించ‌కుండా అడ్డుప‌డుతున్నాడు
ఆయ‌న జ‌నాల‌ను లంచాల‌తో పీల్చుకుతిన్నాడు
ఆయ‌న ఆస్తుల‌పై విచార‌ణ చేసి ఆస్తులు జ‌ప్తు చేయాలి
హ‌న్మ‌కొండ క‌లెక్ట‌రేట్ ఎదుట రైతుల నిర‌స‌న‌

కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : విద్యా సంస్థ‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చేందుకు ల‌క్ష రూపాయాలు డిమాండ్ చేసి ఏసీబీ అధికారుల‌కు అడ్డంగా బుక్కైన హ‌న్మ‌కొండ అద‌న‌పు క‌లెక్ట‌ర్ వెంక‌ట్‌రెడ్డి అవినీతి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. హ‌న్మ‌కొండ జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ హోదాను అడ్డుపెట్టుకుని అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాడంటూ రైతులు ఆరోపిస్తున్నారు. హన్మ‌కొండ జిల్లా కలెక్టరేట్‌ లో శుక్ర‌వారం జరిగిన ఏసీబీ దాడుల్లో ముగ్గురిని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. పాఠశాల అనుమతులకు సంబంధించి రూపాయలు ఒక లక్ష లంచం డిమాండ్ చేసి, అందులో అరవై వేలు తీసుకుంటున్న సమయంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి (డిఈఓ ఇన్‌చార్జిగా కూడా పనిచేస్తున్నారు)ను ఆయ‌న కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో విద్యాశాఖకు చెందిన ఇద్దరు సిబ్బంది గౌస్, మనోజ్ ను కూడా ఏసీబీ అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురినీ ఏసీబీ అధికారులు అరెస్టు చేసి శ‌నివారం ఉద‌యం కోర్టులో రిమాండ్ చేశారు.

క‌లెక్ట‌రేట్ ఎదుట రైతుల నిర‌స‌న‌.. ట‌పాసులు కాల్చి సంబ‌రాలు

హ‌న్మ‌కొండ జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ హోదాలో ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల్సింది పోయి.. గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేశార‌ని రైతులు ఆరోపించారు. శ‌నివారం ఉద‌యం హ‌న్మ‌కొండ క‌లెక్ట‌రేట్ ఎదుట దామెర మండ‌లం ఊరుగొండ గ్రామానికి చెందిన ప‌లువురు రైతులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగారు. ఏసీబీకి చిక్కిన వెంక‌ట్‌రెడ్డి ఫొటోతో కూడిన ఫ్లెక్సీని ప్ర‌ద‌ర్శిస్తూ.. ప్ర‌భుత్వం ఆయ‌న ఆస్తుల‌ను జ‌ప్తు చేయాల‌ని రైతులు డిమాండ్ చేశారు. గ్రీన్ ఫీల్డ్ రైతుల‌కు న్యాయం జ‌ర‌గ‌కుండా అడ్డుప‌డ్డాడ‌ని రైతులు ఆరోపించారు. క‌నీసం మార్కెట్ ధ‌ర చెల్లించ‌కుండా ప్ర‌భుత్వాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని ఆరోపించారు. అద‌న‌పు క‌లెక్ట‌ర్ ఆస్తుల‌పై విచార‌ణ జ‌ర‌పించాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంక‌ట్‌రెడ్డి ఏసీబీకి చిక్క‌డంపై రైతులు సంబ‌రాలు చేసుకున్నారు. క‌లెక్ట‌రేట్ ఎదుట ట‌పాసులు కాల్చి.. స్వీట్లు పంచుకున్నారు. ఈ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న ఇప్పుడు రాజ‌కీయ‌, అధికార వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నిట్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

నిట్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాక‌తీయ‌,వరంగల్: వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థలో నిర్వహించిన...

12వ వార్డులో అభివృద్ధి ప‌నులు ప్రారంభం

12వ వార్డులో అభివృద్ధి ప‌నులు ప్రారంభం కాక‌తీయ‌, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండల...

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img