హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకం
ఆర్డీవోకు ప్రజా సంఘాల వినతిపత్రం
కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని ప్రజా సంఘాలు ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించాయి. నాలుగు జిల్లాల మున్సిపల్ చెత్తను ఇక్కడికి తరలించే యోచనతో ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటాయని వారు హెచ్చరించారు. పరిసర గ్రామాల్లో శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.


