epaper
Monday, March 2, 2026
epaper

ఇక్కడ అవకాశాలు పుష్కలం

  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ‘తెలంగాణ’ రోల్ మోడల్
  • లాంగ్-టర్మ్ వాల్యూ క్రియేషన్, కో-క్రియేషన్‌కు ప్రాధాన్యం
  • ‘అమెరికా – యూటా’ రాష్ట్ర పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు

కాక‌తీయ‌, హైద‌రాబాద్ : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిన ‘తెలంగాణ’లో అవకాశాలు పుష్కలమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా – యూటా(Utah) పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ – యూటా ఎండీ, సీవోవో డేవిడ్ కార్లెబాగ్ నేతృత్వంలోని ‘యూటా పారిశ్రామికవేత్తల బృందం’ శుక్రవారం సచివాలయంలో ఆయనను ప్రత్యేకంగా కలిసింది. టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, లైఫ్ సైన్సెస్, ఏఐ ఆధారిత హెల్త్ కేర్, క్లీన్ ఎనర్జీ, ఎడ్యుకేషన్, స్కిల్స్ తదితర రంగాల్లో ‘యూటా–తెలంగాణ’ మధ్య ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడికి గల అవకాశాలపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాక, గ్లోబల్ ఎకానమీకి సపోర్ట్ ఇచ్చేలా, లాంగ్-టర్మ్ వాల్యూ క్రియేషన్ కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తీసుకొచ్చిన సంస్కరణలు, పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఏయే రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం, పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలు, పారిశ్రామికవేత్తలకిచ్చే ప్రోత్సాహాకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం టీ-హబ్, టీ- వర్క్స్, వీ హబ్ లను వరల్డ్ ట్రేడ్ సెంటర్ – యూటా, సిలికాన్ స్లోప్స్ & యూటా టెక్ స్టార్టప్‌లతో అనుసంధానించేలా చొరవ చూపాలని ప్రతినిధి బృందాన్ని ఆయన కోరారు.

ఏఐ, సైబర్ సెక్యూరిటీ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో యూనివర్సిటీ ఆఫ్ యూటా, బీవైయూ, న్యూమాంట్ యూనివర్సిటీలతో కలిసి రాష్ట్రంలోని ప్రముఖ విద్యా సంస్థలు ఉమ్మడి అకడమిక్, రీసెర్చ్ ప్రోగ్రామ్ లను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘యూటా’ రాష్ట్రంతో పటిష్ఠమైన, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ ద్వైపాక్షిక సహకారం పెట్టుబడులకే పరిమితం కాకుండా ఇన్నోవేషన్, స్కిల్స్, టెక్నాలజీ రంగాల్లోఉమ్మడి ఆవిష్కరణలకు దిక్సూచీగా మారాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. తెలంగాణ లాంటి ఫాస్ట్-గ్రోయింగ్, డైనమిక్, ప్రో-యాక్టివ్ రాష్ట్రంతో కలిసి పని చేసేందుకు ‘యూటా’ సిద్ధంగా ఉందని డేవిడ్ కార్లెబాగ్ అన్నారు.

రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడి విషయంలో తెలంగాణతో కలిసి చురుగ్గా పని చేస్తామన్నారు. కార్యక్రమంలో యూటా హౌజ్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ జేసన్ థాంప్సన్, మాట్ మాక్‌ఫెర్సన్, నికోల్ మాక్‌ఫెర్సన్, లైఫ్ టైం ప్రెసిడెంట్ బీజే హాకే, జేకేడీ ప్రెసిడెంట్ మైక్ నెల్సన్, మోనెరె ఏఐ సీఈవో, కో-ఫౌండర్ మౌ నంది, భారత్ వ్యాలీ అడ్వైజర్లు స్టీవ్ వుడ్, సున్‌హాష్ లోడే, ఎక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీస్ ఫౌండర్ లక్ష్మినారాయణ, ఐఐఆర్ఎఫ్ గురు సౌలే తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీకి వినతిపత్రం...

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం జీవో 252 ప్రకారం అమలు…...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ రూ.50 వేలు డిమాండ్‌… ఏసీబీ ట్రాప్‌లో...

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలి 8,203 పోలింగ్ కేంద్రాల్లో భద్రత...

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం ఎన్‌సీసీ సేవలను ప్రశంసించిన జిష్ణు దేవ్...

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర!

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర! దొడ్డిదారిన నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నం నిరుద్యోగుల నోట్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img