కాకతీయ, నేషనల్ డెస్క్: ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. కొత్తగా తయారు చేసిన యుద్ధ నౌకలు ఉదయగిరి, హిమగిరిలను విశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ నౌకలను డిజైన్, స్టైల్, ఆయుధాు, సెన్సార్ వ్యవస్థల్లో ఆత్యాధునిక సాంకేతికతో వీటిని తయారు చేశారు. దేశంలోని వేర్వేరు షిప్ యార్డుల్లో నిర్మించిన రెండు ఫ్రంట్ లైన్ సర్ఫేస్ యుద్ధ నౌకలను ఒకేసారి జాతికి అంకితం చేయడం ఇదే తొలిసారి. బ్లూ వాటర్ పరిస్థితుల్లో రక్షణ బాధ్యతలను నిర్వర్తించే సామర్థ్యం ఈ నౌకల సొంతమని చెప్పవచ్చు.
ఈరెండు నౌకలు బహుల పాత్ర పోషిస్తాయని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. స్వదేశీ యుద్ధనౌక సామర్థ్యానికి ఈ నౌకలు ప్రతీక. ఆత్మనిర్భర్ భారత్ కు ఇవి నిదర్శనమన్నారు. సాంకేతిక పరిజ్నానం ఈ నౌకల తయారీలో ప్రతిబింబిస్తోందని తెలిపారు. 2025 నాటికి 200 యుద్ధ నౌకల నిర్మాణం చేస్తామని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.


