epaper
Sunday, March 1, 2026
epaper

హార్టికల్చర్లో ఊరటి మహేష్‌కు డాక్టరేట్

హార్టికల్చర్లో ఊరటి మహేష్‌కు డాక్టరేట్

అతిచిన్న వయస్సులో పీహెచ్‌డీ పూర్తి

కాకతీయ, దుగ్గొండి: ఉద్యానవన రంగంలో విశేష ప్రతిభ కనబరచి అతిచిన్న వయసులో డాక్టరేట్ పట్టా సాధించిన ఊరటి మహేష్ అందరిమన్ననలు పొందాడు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామవాసి వివరాల్లోకి వెళితే..దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మహమ్మదపురం వ్యవసాయ సహకార సొసైటి చైర్మన్ ఊరటి సునీత మైపాల్ రెడ్డిల కుమారుడు డాక్టర్ ఊరటీ మహేష్ ఆయన తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం కావడంతో వారికష్టంతో చదువుపై మక్కువ పెంచుకున్నాడు. చిన్ననాటి నుంచే ఉన్నత చదువుల వైపుకు అడుగువేసి వ్యవసాయ ఉద్యానవన రంగం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు.

అనంతరం పిహెచ్డి చేసేందుకు గాను మొదటి ప్రయత్నంలోనే సీటు సాధించిన యువ విద్యావేత్త పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టానందుకున్నాడు. యువ విద్యావేత్త 27 ఏళ్లకే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ నుంచి హార్టికల్చర్‌లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్డి) లో పట్టా పొందేందుకు గాను పరిశోధన మార్గదర్శకులు డాక్టర్ కె.ఎం. యువరాజ్ ఆధ్వర్యంలో స్వాలో రూట్ (డికాల్పిస్ హామిల్టోనీ) పరిశోధన అంశంతో జన్యు వైవిధ్యం మరియు విలువ పెంపుపై అధ్యయనాలు పూర్తి చేశాడు. ఈ యువ విద్యావేత్త. 2016–2020 విద్యా సంవత్సరంలో కొండాలక్ష్మణ బాపూజీ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చరల్ యూనివర్సిటీలో బి.ఎస్‌.సి హార్టికల్చర్ లో తన ప్రతిభ తో 7.98 ఓ.జీ.పి.ఏ సాధించాడు.

అనంతరం 2020–2022 కాలంలో కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్‌.సి హార్టికల్చర్ పూర్తి చేసి ఓ జీ పి ఏ 8.95 సాధించాడు. 2022–2025 లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో పీహెచ్.డి పూర్తి చేసి ఓ జీ పి ఏ 9.37 సాధించాడు.తన పరిశోధనలో స్వాలో రూట్ ఒక ఔషధ మొక్కగా ఉండడంతో జన్యు వైవిధ్యం, విలువ పెంపు అవకాశాలను లోతుగా అధ్యయనం చేసి శభాష్ అనిపించాడు. ఈ పరిశోధన ఉద్యాన ఉత్పత్తుల వినియోగం మరియు మార్కెట్ విలువ పెంపులో కొత్త మార్గాలను చూపనుందని విశ్వవిద్యాలయ అధ్యాపకులు మహేష్ ప్రతిభకు మంత్రముగ్ధులయ్యారు.

విద్యాభ్యాసం చేస్తూనే డాక్టర్ మహేష్ విద్యా ప్రయాణంలో దేశీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పేపర్లను ప్రజెంట్ చేసి అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు.పరిశోధన మరియు శాస్త్రీయ ప్రజెంటేషన్లలో తమ ప్రతిభను నిరూపించాడు. అచ్చిన వయసులోనే డాక్టర్ సాధించడంతో దుగ్గొండి మండల వివిధ శాఖల అధికారులు మండల ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు కుటుంబ సభ్యులు వర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని డాక్టర్ ఊరటీ మహేష్ ప్రస్తుత యువతకు సందేశం పంపారు.భవిష్యత్తులో పరిశోధన, బోధన,మరియు ఉద్యాన రంగ అభివృద్ధిలో సేవలను కొనసాగించాలనే ఆలోచనతో మహేష్ ముందుకెళ్తానన్నారు.చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

డాక్టరేట్ పొందడం గర్వంగా ఉన్నది : తల్లిదండ్రులు

వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మా కుమారుడు డాక్టర్ మహేష్ తన కష్టాన్ని చూస్తూ ఉన్నత చదువులు చదివి నేడు ఉద్యానవన రంగంలో డాక్టరేట్ పొందడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు ఊరటి సునీత మైపాల్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img