భక్తి,భావంతో సన్మార్గంలో నడవాలి
*మంత్రి గడ్డం వివేక్
కాకతీయ, రామకృష్ణాపూర్ : ప్రతి వ్యక్తి భక్తి,భావంతో సన్మార్గంలో నడవాలని చెన్నూరు ఎమ్మెల్యే,కార్మిక,ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా పట్టణంలోని సీఎస్ఐ,సీయోను,పెంతేకాస్తు చర్చ్ లలో మంత్రి వివేక్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వివిధ చర్చ్ పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్,నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వెంట జిల్లా డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,గాండ్ల సమ్మయ్య,అబ్దుల్ అజీజ్,యాకుబ్ అలీ,కనకరాజు,కళ్యాణ్,సతీష్,కుమార్ పాల్గొన్నారు.


