కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం కోడిశాల–ఒడ్డుగూడెం మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే, కోడిశాల గ్రామం నుంచి ఒడ్డుగూడెం వైపు ద్విచక్ర వాహనంపై వారు వెళ్తుండగా మిషన్ భగీరథ పిల్లర్‌ను ఢీకొన్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఊక సారయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


