కాకతీయ, రాయపర్తి : గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం మండలంలోని గట్టికల్లు గ్రామంలో మణికంఠ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ టీపీసీసీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హామ్యా నాయక్ పాల్గొని గణపతి మండపంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. ప్రతిరోజు సాయంత్రం భజనలు, కుంకుమార్చన, సంకీర్తనలతో అంగరంగ వైభవంగా మహిళలు చిన్నారుల కోలాటాలు చూపరులను ఆకట్టుకుంటాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చెవ్వు కాశీనాథం, చెవ్వు వెంకన్న, నరసింహుల రామ్మూర్తి, బొమ్మర కృష్ణ, లక్ష్మణ్, మురళి, ముఖేష్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


