epaper
Wednesday, March 4, 2026
epaper

పన్నుల చెల్లింపుపై

పన్నుల చెల్లింపుపై
వడ్డీ మాఫీ ఉండదు

ప్రజలు కార్పొరేషన్‌కు సహకరించాలి

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు చేరుకోవాలి

హన్మకొండ కలెక్టర్ చాహాత్ బాజ్ పాయ్

పన్ను వసూళ్లపై రెవెన్యూ అధికారులతో సమీక్ష‌

కాకతీయ, వరంగల్: ఆస్తి, నీటి పన్ను చెల్లింపులపై ఎలాంటి వడ్డీ మాఫీ ఉండదని హన్మకొండ కలెక్టర్/బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. కార్పొరేషన్‌కు బకాయిగా ఉన్న ఆస్తి, నీటి పన్నులను తక్షణమే చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం హన్మకొండ జిల్లా సమీకృత కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో బల్దియా రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో పన్ను వసూళ్ల పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… గతంలో జీహెచ్‌ఎంసీ మాదిరిగా పన్ను చెల్లింపులపై రీబెట్ అవకాశం ఉంటుందని కొందరు అపోహ పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో జీహెచ్‌ఎంసీ అమలు చేసే చట్టాలు, జీడబ్ల్యూఎంసీ అమలు చేసే చట్టాలు వేర్వేరుగా ఉంటాయని స్పష్టం చేశారు. అందువల్ల ఎలాంటి రీబెట్ లేదా వడ్డీ మాఫీ ఉండదని స్పష్టం చేశారు. నగరానికి సంపూర్ణంగా 15వ ఆర్థిక సంఘం నిధులు అందాలంటే ప్రభుత్వం నిర్దేశించిన పన్ను లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని అన్నారు. గతంలో పన్ను లక్ష్యాలను చేరుకోకపోవడం వల్ల కొన్ని మున్సిపాలిటీలకు నిధులు కోల్పోయిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తుచేశారు.
బల్దియా పరిధిలో ప్రస్తుతం సుమారు రూ.34 కోట్ల పన్ను బకాయిలు వసూలు చేయాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపుకు కేవలం 30 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, పూర్తి స్థాయిలో పన్ను వసూళ్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన వాహనాలు, హోం గార్డుల సహకారం అందించబడుతుందని, అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించి వందశాతం వసూళ్లకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పన్ను బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించి, సంబంధిత ఉన్నతాధికారులతో సమన్వయం చేసి చెల్లింపులు జరగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్తి పన్నులతో పాటు నీటి (నల్లా) పన్నుల వసూళ్లను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, బిర్రు శ్రీనివాస్, సమ్మయ్య, పన్నుల అధికారి రామకృష్ణ, రెవెన్యూ అధికారులు శ్రీనివాస్, షహజాది బేగం, బాకం సంతోష్, ఐటి మేనేజర్ రమేష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకి కొత్త కాంతులు

కొమ్మాల జాతరకి కొత్త కాంతులు నాడు ఎడ్ల బండ్లు… నేడు వాహనాల ర‌ద్దీ జిగేల్‌మనే...

వైభవంగా మల్లికార్జునస్వామి కళ్యాణం

వైభవంగా మల్లికార్జునస్వామి కళ్యాణం కాకతీయ, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లె...

రోడ్డు పనులు పూర్తి చేయాలి

రోడ్డు పనులు పూర్తి చేయాలి కాకతీయ, మరిపెడ : మున్సిపాలిటీ పరిధిలోని కొండ...

జాతరకు పెద్దఎత్తున రాజకీయ ప్రభలు

జాతరకు పెద్దఎత్తున రాజకీయ ప్రభలు ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి, మాజీ ఎమ్మెల్యే పెద్ది...

తూము మూసివేతపై పోలీసులకు ఫిర్యాదు

తూము మూసివేతపై పోలీసులకు ఫిర్యాదు కాకతీయ, ఇనుగుర్తి: కెనాల్ నుంచి బేరు చెరువు...

ఘ‌నంగా హోలీ

ఘ‌నంగా హోలీ కాకతీయ, మరిపెడ: హోలీ వేడుక‌ల‌ను బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో...

ర్యాగింగ్ ఘటనపై

ర్యాగింగ్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి కాకతీయ, మరిపెడ : మరిపెడ మండలంలోని...

ప్రగతి ప్రణాళికకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలి

ప్రగతి ప్రణాళికకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలి వ‌రంగ‌ల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద కలెక్టరేట్‌లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img