epaper
Sunday, March 1, 2026
epaper

ఒకవైపు పెద్దపులి… మరోవైపు చిరుత!

ఒకవైపు పెద్దపులి… మరోవైపు చిరుత!
గజగజ వణుకుతున్న రాజన్న సిరిసిల్ల గ్రామాలు
పాడి పశువులపై వరుస దాడులు
ట్రాప్ కెమెరాలతో అటవీశాఖ నిఘా
అప్రమత్తంగా ఉండాలని అట‌వీశాఖ‌ సూచనలు

కాకతీయ, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో అడవి మృగాల సంచారం ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతోంది. ఒకవైపు చిరుతపులి, మరోవైపు పెద్దపులి గ్రామాల సమీపంలో సంచరిస్తుండటంతో అటవీ ప్రాంత పల్లెల్లో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం నెలకొంది. ముఖ్యంగా పాడి పశువులపై దాడులు పెరగడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని హనుమక్కపల్లిలో అర్ధరాత్రి చిరుతపులి సంచారం కలకలం రేపింది. రైతు రోమాల భూమయ్య పశువుల పాకలో కట్టివేసిన ఆవు దూడపై దాడి చేసి హతమార్చింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ రేంజ్ అధికారి ఖలీలుద్దీన్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాదముద్రలను పరిశీలించిన అధికారులు ఇది చిరుత దాడేనని నిర్ధారించారు. వేములవాడ అటవీ పరిధిలో సుమారు ఐదు చిరుతలు ఉన్నాయని, సాధారణంగా మనుషులపై దాడి చేయవని, ఆకలితో ఉన్నప్పుడు పశువులపై దాడి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

సిరిసిల్లలో పెద్దపులి భయం

ఇక సిరిసిల్ల నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండల పరిధిలో తిప్పాపూర్–పెద్దలింగాపూర్ రహదారి సమీప గుట్టల వద్ద పెద్దపులి మూడు ఆవులు, ఒక దూడను హతమార్చింది. ఇటీవల సిద్దిపేట సరిహద్దు ప్రాంతాలు, తంగళపల్లి మండలంలో కూడా పులి అడుగుజాడలు కనిపించడంతో అటవీ శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. సిద్దిపేటలో సంచరిస్తున్న పులి, సిరిసిల్లలో కనిపించిన పులి ఒకటేనా? లేక వేర్వేరుగా ఉన్నాయా? అన్న దానిపై శాస్త్రీయ ఆధారాలు సేకరిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

ట్రాప్ కెమెరాలతో నిఘా

జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోంది. పులి, చిరుత కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో దండోరా వేయిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మృగాలను పట్టుకుని అడవిలోకి తరలించేందుకు ప్రత్యేక బృందాలను రప్పించారు. రైతులు, కూలీలు పొలాలకు వెళ్లేటప్పుడు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. రాత్రివేళల్లో పొలాల వద్ద నిద్రించవద్దని హెచ్చరించారు. పశువులను అటవీ సరిహద్దు ప్రాంతాల్లో కాకుండా సురక్షిత ప్రదేశాల్లో కట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా పులి లేదా చిరుత అడుగుజాడలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాలని సూచించారు. ఒకవైపు వేములవాడలో చిరుత, మరోవైపు సిరిసిల్లలో పెద్దపులి సంచారంతో గ్రామాలు భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండటమే ప్రస్తుతానికి అత్యంత అవసరమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img